లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రానికి చెందిన యాత్రికులు... రాజస్థాన్‌లోని మౌంట్ అబూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రంలో చిక్కుకుపోయారు. గతనెల 23వ తేదీన స్వస్థలాలకు బయలుదేరేందుకు రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌తో ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. సొంతూళ్లు వదిలి సుమారు 50 రోజులు దాటిపోవటంతో అక్కడున్న మహిళలు, వృద్ధులు, రైతు కూలీలు అవస్థలు పడుతున్నారు.
వివిధ జిల్లాలకు చెందిన వీరంతా పెద్ద సంఖ్యలో మార్చి 12వ తేదీన మౌంట్ అబూ వెళ్లారు. పది రోజులుపాటు బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండి వెనక్కి వచ్చేందుకు వీలుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. లాక్‌డౌన్ ప్రకటనతో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. తమను స్వగ్రామాలకు తరలించాలని మౌంట్ అబూలో నిలిచిపోయిన రాష్ట్ర వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలిస్తే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు, క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధమేనని చెప్పారు.
ఇదీ చదవండి