విజయవాడ వేదికగా తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మొగల్రాజుపురం సిద్ధార్థ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. 2015 తరువాత ఇదే నాల్గవ మహాసభ అని నిర్వాహకులు తెలిపారు. మాతృభాషను 'కాపాడుకుందాం-స్వాభిమానాన్ని చాటుకుందాం' అనే నినాదంతో ఈ సభలను ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి రచయితలు, కవులు, సాహీతీవేత్తలు హాజరయ్యారు. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతీఒక్కరికి తెలుగు రావాలని... రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు ఔన్నత్యాన్ని అందరు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.