ETV Bharat / state

ఈనాడు ఎడిటర్‌కు తెలుగు భాషా పురస్కారం ప్రదానం

author img

By

Published : Feb 11, 2022, 9:01 AM IST

Award to eenadu editor: సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్‌ మానుకొండ నాగేశ్వర్ రావుకు తెలుగు భాషా పురస్కారం వరించింది. విజయవాడలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో.. శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చేతుల మీదుగా నాగేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు.

Award to eenadu editor
Award to eenadu editor

Award to eenadu editor: సాహితీ, పాత్రికేయ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఈనాడు ఆంధ్రప్రదేశ్​ సంపాదకులు, ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్‌ మానుకొండ నాగేశ్వర్ రావుకు తెలుగు భాషా పురస్కారాన్ని ప్రదానం చేశారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం విజయవాడ నగరం గాంధీనగర్‌లోని హోటల్‌ ఐలాపురంలో నిర్వహించారు.

ఈ ఏడాది మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాషా పురస్కారాన్ని ఎం. నాగేశ్వరరావు.. శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ ఐలాపురం రాజా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ చేతుల మీదుగా అందుకున్నారు. రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.వి. పూర్ణచంద్‌, ఉపాధ్యక్షుడు గుమ్మా సాంబశివరావు, సభ్యులు డాక్టర్‌ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, సిరిపురపు అన్నపూర్ణ, ఎస్‌. శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ArunSagar Awards 2022: 'మనకెప్పుడు అవార్డు వస్తుందనేవాడు.. ఇప్పుడు తానే అవార్డుగా మారాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.