ప్రముఖ సినీ నటుడు నాని, ఆయన సతీమణి అంజన సహకారంతో... కృష్ణా జిల్లాలోని పున్నవల్లి వెలది గ్రామాల్లో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ విధించిన కారణంగా ఆయా గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆసరా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి ఇంటికీ కూరగాయలు అందించిన హీరో నాని కుటుంబానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పున్నవల్లి గ్రామంలో ఆసరా ఫౌండేషన్ నిర్మించిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి నాని సతీమణి అంజన వచ్చారని గుర్తు చేసుకున్నారు. తాజా చర్యతో.. ఈ గ్రామం పట్ల అనుబంధాన్ని పెంచుకున్నారని ఆనందించారు.
ఇదీ చూడండి: