రాష్ట్ర వ్యాప్తంగా 104 కాల్ సెంటర్ ద్వారా కొవిడ్ సహా వేర్వేరు రోగులతో 5 లక్షల 53 వేల 306 టెలి కన్సల్టేషన్ సేవలు అందాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 104ద్వారా టెలికన్సల్టేషన్ సేవలు అందించేందుకు 5012 మంది వైద్యులు నమోదు చేసుకున్నారని.. ఇందులో 914 మంది స్పెషలిస్టులు కూడా ఉన్నారని తెలియచేసింది.
గంటకు రూ.400 చెల్లింపు..
కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలకు టెలి కన్సల్టేషన్ ద్వారా వైద్యులు చికిత్సలు సూచించారని స్పష్టం చేసింది. ఇందుకోసం ఒక్కో వైద్యుడికి గంటకు నాలుగు వందల రూపాయల మేర చెల్లించినట్టు వివరించింది.
మొత్తంగా 21 వేల 552 మందికి..
గన్నవరంలోని టీసీఎస్ క్యాంపస్‌తో పాటు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్న 104 కాల్ సెంటర్ల ద్వారా ఈ సేవలందాయని తెలియచేసింది. టెలి కన్సల్టేషన్‌లో కొవిడ్ సంబంధింత అంశాల్లో 21 వేల 552 మందికి వైద్యులు హోమ్ ఐసోలేషన్ సూచించారని తెలిపింది. ఆస్పత్రుల్లో చేరాల్సిందిగా 1536 మందికి 104 టెలికన్సల్టేషన్ ద్వారా సూచనలు అందాయని వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి లక్షా 23 వేల 142 కాల్స్ వస్తే కృష్ణా జిల్లా నుంచి లక్షా 12 వేల కాల్స్ వచ్చినట్టు స్పష్టం చేసింది.
ఇవీ చూడండి : YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!