ETV Bharat / state

తెలంగాణ మేడారం జాతరకు హెలికాప్టర్​ సర్వీస్​ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర కోసం ఆ రాష్ట్రప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించింది. బేగంపేట ఎయిర్ పోర్టులో హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మేడారం జాతర ముగిసే వరకు ఈ సేవలు కొనసాగించనున్నట్లు మంత్రి తెలిపారు. హెలికాప్టర్​ సేవలకు 9400399999 నెంబరును సంప్రదించాలన్నారు.

helicopter service started from hyderabad to medaram
మేడారం జాతరకై హెలికాప్టర్​ సర్వీస్​ ప్రారంభించిన తెలంగాణ మంత్రి
author img

By

Published : Feb 2, 2020, 2:48 PM IST

మేడారం జాతరకై హెలికాప్టర్​ సర్వీస్​ ప్రారంభించిన తెలంగాణ మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్​ నుంచి మేడారానికి హెలికాప్టర్​ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హెలికాప్టర్​ సర్వీస్​ను బేగంపేట్​ ఎయిర్​ పోర్టులో ప్రారంభించారు. జాతర ముగిసే వరకు ఈ సేవలు కొనసాగించనున్నట్లు మంత్రి తెలిపారు. హెలికాప్టర్​లో ఆరుగురి ప్రయాణానికి లక్షా 80 వేల రూపాయలతో పాటు జీఎస్టీ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు.

వీఐపీ దర్శనం

ఈ ప్యాకేజీలో భాగంగా సమ్మక్క - సారలమ్మ వీఐపీ దర్శనం కల్పించనున్నారు. మేడారం జాతర దగ్గర విహంగ వీక్షణం చేసేందుకు రూ.2,999 ఛార్జీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని... ఇప్పటికే రామప్ప యునెస్కో బృందం పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. హెలికాప్టర్​ సేవలకు 9400399999 నెంబరును సంప్రదించాలని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి:

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. స్మగ్లర్లలో ఆర్మీ ఉద్యోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.