ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ: ఈ నెల 12 వరకే సమావేశాలు.. 2023-24 బడ్జెట్ రూ.3లక్షల కోట్లు ?

Telangana Assembly Sessions 2023: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని సీఎం కేసీఆర్‌ శనివారం శాసనసభలో తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండోవారంలోనే బడ్జెట్‌ సమావేశాలు ముగియనుండటంతో బడ్జెట్‌ సమావేశాలపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
author img

By

Published : Feb 5, 2023, 10:36 AM IST

Telangana Assembly Sessions 2023: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం శాసనసభలో తెలిపారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో హరీశ్‌రావు, మండలిలో ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 7న శాసనసభకు సెలవు. తిరిగి 8న సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. దానికి రాష్ట్ర ఆర్థికమంత్రి సమాధానం చెబుతారు.

9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చ ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చ అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి.

చరిత్రలో తొలిసారి ఫిబ్రవరిలోనే : రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండోవారంలోనే బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా..తర్వాత ఆరు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్‌అకౌంట్‌ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం దృష్ట్యా 2014లో నవంబరు అయిదో తేదీన బడ్జెట్‌ సమావేశం జరిగింది. 2018 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరగగా... మరుసటి ఏడాది సెప్టెంబరు 9న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

సమావేశాల తర్వాత అమల్లోనే పాత బడ్జెట్‌: ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు మార్చిలో ఉంటాయని అంతా భావించినా.. కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్‌ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్‌ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా.. ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్‌ అమల్లోనే ఉంటుంది. ఇంత త్వరగా బడ్జెట్‌ సమావేశాల ముగింపుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

దేని కోసం ముందుగా బడ్జెట్ సమావేశాలు : సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి విస్తరించడానికి భారాసను ఏర్పాటు చేసి కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారాస ఆవిర్భావసభ జరగగా.. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో సభను నిర్వహించనున్నారు. తర్వాత ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో సభలున్నాయి. పార్టీ రాష్ట్రశాఖల ఏర్పాటుతో పాటు రాష్ట్రాలవారీగా బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పెద్దఎత్తున ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు.

ముందస్తు ఎన్నికల కోసమే: ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించి, అదే రోజు పరేడ్‌ మైదానంలో భారీ సభను నిర్వహించనున్నారు. దీని కోసం జనసమీకరణ, కార్యక్రమానికి సీఎంలు, మాజీ సీఎంల ఆహ్వానం, బస ఇతర ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు. తర్వాత అమరవీరుల స్మారక స్తూపం ప్రారంభించనున్నారు. ఈ నెల చివరి వారంలో బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 18 జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవం జరిగింది. మరో ఎనిమిది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాలను త్వరగా ముగిస్తున్నారని బీఆర్​ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని విపక్షాలు మాత్రం బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరిలో జరపడాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే ఫిబ్రవరిలోనే ముగిస్తున్నారని విమర్శిస్తున్నాయి. తమ పార్టీ శ్రేణులకు ఇదే సందేశాన్ని ఇస్తున్నాయి.

ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ : రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకురానున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2 లక్షలా 52 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది లక్షా 93 వేల 29 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి.

15 శాతానికిపైగా వృద్ధి ఉండొచ్చు: రూ.లక్షా 9 వేల 800 కోట్ల ఆదాయం వచ్చింది. పన్ను ఆదాయం లక్షా 26 వేల 606 కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ చివరి నాటికి 92 వేల 66 కోట్లు సమకూరాయి. మిగిలిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికిపైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. పన్నేతర రాబడి కూడా రూ.10 వేల కోట్ల వరకు వచ్చింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

రుణాలకు సంబంధించి కేంద్రం ఆంక్షలు: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి. గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి ఇప్పటికి వచ్చింది చాలా తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ నెల వరకు వచ్చింది 16 వేల కోట్లు వచ్చాయి. ప్రత్యేకించి గ్రాంట్ల విషయంలో సర్కార్ అంచనాలు భారీగా తప్పాయి. 41 వేల కోట్లు అంచనా వేస్తే... డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.

ఎఫ్​ఆర్​బీఎంకు లోబడి ఏడాది 52 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఆ మొత్తానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం 37 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు కూడా ఆటంకం కలిగింది. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లక్షా 24 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. చివరి త్రైమాసికంలో వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి.... వ్యయం రెండు లక్షల కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

బడ్జెట్ ఖరారు చేయనున్న ప్రభుత్వం : 2023-24 బడ్జెట్ కోసం అన్ని శాఖలు మూడు లక్షలా 40 వేల కోట్ల వరకు ప్రతిపాదించినట్లు సమాచారం. శాఖల వారీగా జరిపిన కసరత్తులో ఆ మొత్తాన్ని కుదించినట్లు తెలిసింది. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెరవేర్చాల్సిన హామీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఆకాంక్షల అమలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఖరారు చేయనుంది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సహజంగానే కేటాయింపులు పెరగనున్నాయి. ప్రస్తుత ఏడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేస్తూ వచ్చే ఏడాది రాబడులు, అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌తో.. వచ్చే ఏడాది రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై స్పష్టత వచ్చింది.

2023-24 లో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్ర వాటాగా 21 వేల కోట్లకు పైగా రానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి నిధులు రానున్నాయి. రాష్ట్రానికి అదనపు నిధులు, గ్రాంట్లను కేంద్రం ప్రతిపాదించలేదు. రుణ పరిమితి పెంపునకు కూడా అనుమతించలేదు. దీంతో సొంత రాబడులు, ఇతర మార్గాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధార పడాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని వార్షిక పద్దును ఆమోదించనున్నారు. ఎన్నికల కోణంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ తీసుకురానున్నారు. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్ రెండు లక్షలా 52 వేల కోట్లు కాగా... రానున్న ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్ల మార్కును సమీపించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.