కృష్ణా జిల్లా నందిగామలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న హుజుర్ నగర్ లో సారా తయారీకి అవసరమైన నల్లబెల్లాన్ని నందిగామ నుంచి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో రామకృష్ణ అనే బెల్లం వ్యాపారి నుంచి సుమారు 60వేల విలువ చేసే క్వింటా నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి-ఇవేనా ఓడించింది!.. ఓటమిపై తెదేపా విశ్లేషణ