ETV Bharat / state

రిజర్వాయర్ల సర్వేకు సాంకేతిక కమిటీ ఏర్పాటు - సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ

జలాశయాల్లో పూడిక నిల్వ, వాటి నీటి సామర్థ్యాలను సర్వేచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సాంకేతిక బిడ్లు ఆహ్వానించాలని చర్యలు చేపట్టింది. సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

technical committee for survey of reservoirs
రిజర్వాయర్ల సర్వేకు సాంకేతిక కమిటీ ఏర్పాటు
author img

By

Published : Oct 14, 2020, 7:02 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వివిధ రిజర్వాయర్లలో పూడిక నిల్వ, నీటి సామర్థ్యాల సర్వే నిర్వహించేందుకు సాంకేతిక బిడ్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏలేశ్వరం, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​లో పూడిక, నీటి నిల్వసామర్థ్యాల సర్వే చేపట్టనున్నారు. శ్రీశైలం, రాళ్లపాడు, మైలవరం రిజర్వాయర్లలో బాతోమెట్రిక్ సర్వే కోసం జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద పోటీ బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

ఈ సర్వే పనుల అంచనాల రూపకల్పన కోసం సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా కేంద్ర జలసంఘం నుంచి హైడ్రాలజీ విభాగం సూపరిండెంట్ ఇంజనీర్, సాంకేతిక విభాగం నుంచి కాకినాడలోని జాతీయ హైడ్రాలజీ సంస్థ డైరెక్టర్​ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి:

ఆకాశానికి చిల్లు.. భాగ్యనగరంలో భారీ వర్షం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.