Teachers Protest For Solving Problems in Vijayawada: వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని ఉపాధాయ్యులు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని వారు పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు బెజవాడకు తరలివచ్చారు. లెనిన్ సెంటర్‌కు చేరుకున్న యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి ప్రైవేటు ఫంక్షన్ హాళ్లకు తరలించారు. తమ రక్షణ కోసం దాచుకున్న డబ్బులను జగన్ ప్రభుత్వం సొంతానికి వాడుకుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు.
Government Not Solve Teachers Problems: తమకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్మును ప్రభుత్వం వినియోగించుకోవడం అన్యాయమని టీచర్లు వాపోయారు. ప్రతీ నెల ఒకటో తేదీన టీచర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో తమ ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని టీచర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఒకటో తేదిన జీతం రాదు -149 నెలలుగా డీఏ లేదు, ఈ నెల 15 న విజయవాడలో ధర్నాకు సిద్దమవుతున్న ఏపీటీఎఫ్
Police Arrested in Teachers And UTF Leaders: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ పిలుపునిచ్చింది. విజయవాడలో ఉపాధ్యాయుల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చలో విజయవాడ నిర్వహించి తీరుతామని యూటీఎఫ్ నాయకులు తేల్చి చెప్పారు. ఆందోళన చేపట్టడానికి ధర్నా చౌక్‌కు వెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సొమ్ము సుమారు 18వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరితే, మమ్మల్ని అరెస్టు చేయడం అన్యాయమని యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు.
ఉపాధ్యాయులు బాగుంటేనే - విద్యార్థులు బాగుపడతారు! జీపీఎస్‌ను రద్దు చేయండి - ఓపీఎస్ ను కొనసాగించండి
Teachers Strike in Vijayawada Dharna Chowk: తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్‌లో 36 గంటల నిరవధిక దీక్షకు యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా నందిగామకు చెందిన యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులను, టీచర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సంఘ నాయకులకు నోటీసులు ఇచ్చి గృహ నిర్భందం చేశారు. సంఘ జిల్లా మాజీ కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావును నందిగామలో గృహ నిర్బంధం విధించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ధర్నాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'మాట తప్పను - మడమ తిప్పను' మాటలు గుర్తున్నాయా సీఎం : యూటీఎఫ్ ఉపాధ్యాయులు