చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆత్మావలోకనం చేసుకోవాలని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర హితవు పలికారు. అంగబలం, అర్ధిక బలం ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎస్సీలకు అన్యాయం జరిగి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం జీవోపై ఇప్పుడు మాట్లాడటం జగన్నాటకంలో భాగమేనని ఆరోపించారు.
ఎస్సీల హక్కులపై పోరాడుతున్నట్లుగా నటిస్తున్నారే తప్ప.. వారిపై ప్రేమ లేదని విమర్శించారు. ఆళ్ల ధరించిన ముసుగు గురించి అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినా రెండేళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
ఇవీ చూడండి...