వైకాపా ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. దోచుకోవటం, దాచుకోవడంలో అన్ని హక్కులు వైకాపాయేనని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని పేదలను నమ్మించి మోసం చేసి ఏడాదికి 5వేల కోట్లు, ఐదేళ్లల్లో 20 వేల కోట్ల రూపాయలు జే–టాక్స్ వసూలు చేసుకునే వైకాపా మాటలను ప్రజలు విశ్వసించరని మండిపడ్డారు. వైకాపా ట్విటర్‌లో పోస్టింగులు పెట్టడానికి కిరాయి పేటీఎం బ్యాచ్ లను పెంచి పోషిస్తోందన్నారు. బీహార్ నుంచి దొంగ ఖాతాలు పెట్టిన వైకాపా నాయకులా.. తెలుగుదేశం ట్విట్టర్, జూమ్ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. గుడివాడ అమర్ నాథ్ కళ్లు తెరిచి వాస్తవాలు చూడాలని హితవు పలికారు.
ఇవీ చదవండి