మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకి పీఎఫ్ ఖాతా వెంటనే తెరవాలని తెదేపా ఎమ్మెల్సీ రామకృష్ణ డిమాండ్ చేశారు. పీఎఫ్ అకౌంట్స్ తెరవకపోవడంవల్ల ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ కళాశాలలో పని చేసిన తనకే పీఎఫ్ అకౌంట్ ఉందని.. కానీ మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ ఇతర స్కూల్ టీచర్స్కి మాత్రం పీఎఫ్ ఖాతాలేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా 116 మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరికీ పీఎఫ్ అకౌంట్ తెరవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:ఆమె జన్మదిన వేడుక... ఎందరికో ఆదర్శం...