వాలంటీర్ వ్యవస్థకు సన్మానం పేరుతో.. ప్రభుత్వం 261 కోట్ల రూపాయలను తగలేసిందని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మండిపడ్డారు. వాలంటీర్లు లేనప్పుడు ప్రజలకు పింఛన్లు, రేషన్, ఇతరపథకాలు అందలేదా అని నిలదీశారు. వాలంటీర్లను నియమిస్తూ.. 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పారని ఆక్షేపించారు. వారంతా వేతనాలు పెంచాలని డిమాండ్ చేయగానే.. వాలంటీర్లు కేవలం సేవకులు మాత్రమేనన్నారని అశోక్ బాబు విమర్శించారు. వాలంటీర్లకు వేతనాలు పెంచడం చట్టపరంగా సాధ్యం కాదనే ఉద్దేశంతోనే.. ఉగాదిపురస్కారాల పేరుతో ముఖ్యమంత్రి వారికి లంచాలిచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహరంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...