ETV Bharat / state

'కొందరు అధికారులు వైకాపాకు కొమ్ముకాస్తున్నారు'

author img

By

Published : Feb 22, 2021, 12:46 PM IST

నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 6 గంటల వరకూ వెలువడిన ఫలితాల్లో ... 11 వందల 19 స్థానాల్లో తెలుగుదేశం మద్దతుదారులు గెలిచారని ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల్లో కొంత మంది పోలీసులు, ఎన్నికల సిబ్బంది... వైకాపాకు అనుకూలంగా ఫలితాల్ని మారుస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు ఆరోపించారు.

tdp mlc ashok babu
వైకాపా పై తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు ధ్వజం

నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం ఆరు గంటల వరకు వెలువడిన ఫలితాల్లో.. తాము బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్ధులు 1119 చోట్ల గెలుపొందినట్లు తెలుగుదేశం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో 111 మంది, విజయనగరంలో 104, విశాఖ 51 మంది గెలుపొందినట్లు వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో 98, పశ్చిమ గోదావరిలో 103, కృష్ణలో 88, గుంటూరులో 93 మంది, ప్రకాశం జిల్లాలో 76, నెల్లూరులో 60 మంది సర్పంచ్‌లుగా ఎన్నికైనట్లు ప్రకటించింది. రాయలసీమ జిల్లాల్లో కడపలో 81, కర్నూలులో 82, అనంతపురంలో 79, చిత్తూరులో 93 చోట్లు తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న కొంతమంది పోలీసులు, సిబ్బంది వైకాపాకు అనుకులంగా ఫలితాలు మారుస్తున్నారని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారులందరూ సత్వరమే ఫలితాలను ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని పరిధిలోని గ్రామాలైన వైకుంఠపురం, వేల్పూరు, పెదకూరపాడులో తెదేపా అభ్యర్థులు గెలిచినప్పటికీ... ప్రకటించకుండా వైకాపా గెలుపు కోసం అధికార యంత్రాంగం ఆరాటపడుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. రాజధాని గ్రామాల్లో తెలుగుదేశం గెలవకూడదనే వైకాపా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైకాపా నేతల అరాచకాలపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసినా.. క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు ప్రభుత్వానికే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. శ్మశానంలో దయ్యాల్లా వైకాపా నేతలు అర్థరాత్రి తిరుగుతూ ప్రజలను భయపెట్టి.. గెలుపును సొంతం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.