విశాఖపట్నంలో వైకాపా నేతలు... ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. జగన్ అండ్ కో తో ఉత్తరాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. 93 మంది అమరావతి రైతులు తనువు చాలించినా... సీఎం జగన్ మనసు చలించలేదు.
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
రైతు త్యాగాలను అవహేళన చేయటం వైకాపా నేతలకు తగదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.
ఇండో అమెరికన్ బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ బుచ్చి రాం ప్రసాద్
తెదేపా నేత లోకేశ్‌ను విమర్శించడం విజయసాయిరెడ్డి అతి తెలివికి నిదర్శనం. చంద్రబాబు నుంచి లోకేశ్ మంచితనం, సమర్ధవంతమైన నాయకత్వాన్ని వారసత్వంగా తీసుకున్నారు.
తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం
--
ఇదీ చదవండి: