రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు తెలుగు దేశం పార్టీనే కారణమని... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవుడిపై ప్రమాణం చేయగలరా అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి సవాల్ చేశారు. మతంపై జరుగుతున్న దాడుల నుంచి సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల దాడులకు సంబంధించి 136 సంఘటనల ఆధారాలు తెదేపా వద్ద ఉన్నాయని వెల్లడించారు. పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దాడి జరిగితే 24గంటల్లోనే 45 మంది నిందితులను అరెస్ట్ చేశారన్న పట్టాభి... రాష్ట్రలో మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్... మీడియాతో మాట్లాడి 24 గంటలు గడవకముందే ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ శ్రీలక్షీ నరసింహస్వామి దేవాలయ ప్రాకారంపై దాడి జరిగిందని పట్టాభి దుయ్యబ్టటారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు.
వర్ల రామయ్య...
రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ విచారణకు ఆదేశించిన సీఐడీ చీఫ్ కూడా క్రైస్తవుడేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. క్రైస్తవుడి నేతృత్వంలో జరిపించే సీఐడీ విచారణ వల్ల ఏం న్యాయం జరుగుతుందని ఆయన నిలదీశారు. సీఐడీ చీఫ్ ను మార్చి విచారణ జరిపించాలని..., లేదా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.
తాడిపత్రి వివాదంపై జగన్ దృష్టి.. సీఎం క్యాంప్ కార్యాలయానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి