సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను తెదేపా నేతలు కలిశారు. 7 నియోజకవర్గాల్లో 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈసీకి ఇచ్చిన నివేదికనే సీఎస్‌కు అందజేశారు. 19చోట్ల రీపోలింగ్ జరపాలని గతంలోనే ఈసీని కోరామని మంత్రి ఆనందబాబు తెలిపారు. తెదేపా ఫిర్యాదులపై ఇప్పటివరకు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముందుగానే ఈసీతో మాట్లాడుకుని.. వైకాపా సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తోందని ఆనందబాబు ఆరోపించారు. దశలవారీగా రీపోలింగ్ జరిపిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవన్న ఆనందబాబు.. తెదేపా విజ్ఞప్తిని కూడా సీఈసీకి పంపాలని సీఎస్‌ను కోరామని తెలిపారు.
ఇది కూడా చదవండి.