ETV Bharat / state

TDP Leaders House Arrest : తెల్లవారకముందే..! ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు.. టీడీపీ నేతల గృహ నిర్బంధం

TDP Leaders House Arrest : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్​కు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

tdp_leaders_house_arrest
tdp_leaders_house_arrest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2023, 1:41 PM IST

Updated : Sep 11, 2023, 2:30 PM IST

TDP Leaders House Arrest : చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆందోళనలో పాల్గొనకుండా ముందస్తుగా ఇళ్లకే పరిమితం చేశారు. ఈ క్రమంలో పలుచోట్లు పోలీసుల వైఖరి కారణంగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

TDP Leaders Meet Governor : 'చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారేమో..!' గవర్నర్​ను కలిసిన టీడీపీ నేతల బృందం

కక్షపూరిత రాజకీయాలే కారణం.. జగన్‌మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలే రాష్ట్రంలో నేటి పరిస్థితులకు కారణమని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరులోని కన్నా ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆందోళనల్లో పాల్గొనకుండా ఆయన్ను గృహ నిర్బంధం ( House arrest ) చేశారు.

అక్రమ అరెస్టు.. చంద్రబాబును రాజకీయంగా అడ్డుకునేందుకు అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేత చినరాజప్ప ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యపాత్ర పోషించాల్సిన ప్రభుత్వ ఉన్నతాధికారులు.. ముఖ్యమంత్రి జగన్‌కి తొత్తులయ్యారని విమర్శించారు.

CBN Breakfast Fruit salad : చంద్రబాబు అల్పాహారంగా ఏం చేశారంటే..?

అడ్డుకున్న పోలీసులు.. ఎన్టీఆర్‌ జిల్లా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ ( Telugu Desam leader Chandrababu arrested ), రిమాండ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె గోడ దూకి బయటకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. విచక్షణారహితంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. వెంటనే తన ఇంటి నుంచి పోలీసులను బయటకు వెళ్లాలని తంగిరాల సౌమ్య డిమాండ్‌ చేశారు.

కోటంరెడ్డి గృహనిర్బంధం.. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపు ( TDP state bandh call ) నిచ్చిన నేపథ్యంలో... నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసులు గృహ నిర్బంధం విధించడంపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన ఒక్కడి వందల మందిని ఇబ్బందులకు గురి చేయొద్దని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మూడు రోజులుగా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచగా.. కుటుంబ సభ్యులను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leaders Protest in AP: చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న ప్రజలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..

విజయవాడలో.. విజయవాడ బస్టాండ్ ఎదుట టీడీపీ, జనసేన ( Jansena ) శ్రేణులు నిరసన తెలిపాయి. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నిరసనలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొనగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

యనమల ఆగ్రహం.. చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చిత్రీకరించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ లండన్‌ నుంచి తిరిగి రాగానే... రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికే చంద్రబాబును అరెస్టు చేశారు తప్ప.. కేసుల్లో ఎలాంటి పస లేదని ధ్వజమెత్తారు.

Live Updates: చంద్రబాబు రిమాండ్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

Last Updated : Sep 11, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.