ETV Bharat / state

TDP Leaders Fired on Jagan Government: 'నిధుల దోపిడీ తప్ప.. నీళ్ల విలువ తెలియని ప్రభుత్వమిది..' 'జగన్​కు పట్టిసీమే దిక్కయ్యింది' - వైసీపీ

TDP Leaders Fired on Jagan Government : సీఎం జగన్.. కాలువల పూడిక పేరుతో పెద్ద ఎత్తున నిధులు కాజేశారని, దోపిడీ డబ్బు లెక్కించుకోవడం తప్ప రైతుల గురించి వ్యవసాయ శాఖ మంత్రికి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ దండగ అని నిండు సభ సాక్షిగా మాట్లాడిన సీఎం.. ఇవాళ కుమిలి, కుమిలి ఏడుస్తున్నాడని మాజిీ మంత్రి దేవినేని మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 13, 2023, 4:09 PM IST

TDP Leaders Fired on Jagan Government : పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన జలాలు వృథా అవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమశిల జలాల వృథా, ఇరిగేషన్ లో వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో లక్ష ఎకరాలకు 35 టీఎంసీల నీరు వృథా అయితే నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖలు ఏమి చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో నీటిపారుదల, వ్యవసాయ శాఖలు అదుపు తప్పాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో నీరు లేకున్నా ఎగువ ప్రాంతాల నుంచి తరలించి రైతుల అవసరాలు తీర్చామని చెప్పారు. కాలువల పూడిక పేరుతో పెద్ద ఎత్తున నిధులు కాజేశారని విమర్శించారు. దోపిడీ డబ్బు లెక్కించుకోవడం తప్ప రైతుల గురించి వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్ఎస్ఆర్​జీ లెక్కల వివరాలు సమాచారం హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు. లస్కర్లకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. జిల్లాలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ కు లేదా అని ప్రశ్నించారు. మంత్రులు అంబటి, కాకాణి కలిసి నెల్లూరు జిల్లాను ముంచేశారని, ముఖ్యమంత్రి విచారణ జరిపించి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Farmers not Received Compensation: ప్రాజెక్టు పూర్తై 14 ఏళ్లవుతున్నా.. రైతులకు న్యాయం జరగలేదు..

నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ భ్రష్టు పట్టాయి. నెల్లూరు జిల్లాలో దాదాపు 5.5లక్షల ఎకరాలు సోమశిల, 2.5లక్షల ఎకరాలు తెలుగుగంగ కింద మొత్తం 8లక్షల ఎకరాలు వరి సాగవుతుంది. మే 1వ తేదీ నాటికి 50.9టీఎంసీల నీరు ఉంటే 2.85వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, లక్ష ఎకరాలకు 35టీఎంసీలు కాజేశారంటే.. ఈ జిల్లాలో మంత్రి ఉన్నాడా..? నీటిపారుదల, వ్యవసాయ శాఖలు ఏం చేస్తున్నాయి.? - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి

Pattiseema పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్దా కృష్ణ నదిలో కలిసే ప్రదేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. పవిత్ర సంగమం వద్ద రాంగోపాల్ వర్మ షూటింగ్ తీయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టిసీమ పథకం దండగ అంటూ ప్రచారం చేసిన వైసీపీ నాయకులు ఇవాళ ఏ మొహం పెట్టుకొని సినిమా షూటింగులు తీయించుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసే 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను అటక ఎక్కించాడని ధ్వజమెత్తారు. పట్టిసీమ దండగా అంటు వాటి పంపులు పీకుతానని ఇప్పుడు వైసీపీ నాయకులు అంతర్మథనంలో పడ్డారన్నారు. బూతుల డైరెక్టర్ కు దమ్ముంటే టీడీపీ హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై సినిమా తీయాలని దేవినేని సవాల్‌ విసిరారు.

సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిలిపివేస్తున్నారు? దేవినేని ఉమా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా పట్టిసీమను పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ కాదు కదా.. తాళాలు వేశాడు. పైగా పంపులు పీకేయిస్తానని అసెంబ్లీలో చెప్పారు. కానీ చివరకు పట్టిసీమే దిక్కయ్యిందని బోధపడింది. ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఏ మొహం పెట్టుకుని ప్రజలను నమ్మించాలో అర్థంకాక.. బూతు డైరెక్టర్​ను తీసుకువచ్చి సినిమాలు తీయిస్తున్నాడు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో 13లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ఆర్జీవీకి దమ్ముంటే ఆ విషయాలపై సినిమాలు తీయాలి. - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

ఇలా అయితే ఎలా పదిలం?.. నిపుణుల నివేదికలే తప్ప ముందుకు సాగని శ్రీశైలం పనులు

TDP_Leaders_Fired_on_Jagan_Government నిధుల దోపిడీ తప్ప.. నీళ్ల విలువ తెలియని ప్రభుత్వమిది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.