ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కుతో పాటు.. సూచనలిచ్చే స్వేచ్ఛ కూడా లేదనే నియంతృత్వ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం దృష్ట్యా పాలకులను అప్రమత్తం చేస్తే చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. కర్నూలులో కొత్త వేరియంట్ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని సీసీఎంబీ శాస్త్రవేత్తల హెచ్చరిక మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాలు పక్కనపెట్టి ప్రభుత్వాన్ని మెప్పించే విధంగా పోలీసులు వ్యవహరించడం దురదృష్టకరమని సోమిరెడ్డి మండిపడ్డారు.
కరోనా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. వైరస్ వల్ల చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలి.. కరోనాను కట్టడి చేయడంలో విఫలమవ్వడాన్ని నిరసిస్తూ తన నివాసంలో దీక్షకు దిగారు. తెదేపా అధినేతపై సజ్జల వ్యాఖ్యలు సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పదించి 18 ఏళ్ల పైబడిన వారిందరికి కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ వాక్సిన్ అందేవరకూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: