TDP PROTEST: మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుల మైనింగ్ మాఫియా, మట్టి దోపిడీని ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. గుడివాడ నియోజకవర్గంలో అడ్డగోలు మట్టి దోపిడీకి పాల్పడిన మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సిద్ధాంతం గ్రామ పంచాయతీ చెరువుగట్టుపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ధర్నా నిర్వహించారు.
సిద్ధాంతం గ్రామ చెరువులో అధికార పార్టీ మైనింగ్ మాఫియా మట్టి దోపిడీని గ్రామస్థులు మీడియాకు చూపించారు. "మట్టి మాఫియా నశించాలి, డౌన్ డౌన్ కొడాలి నాని" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుడివాడలో గడ్డం గ్యాంగ్ చేసిన మట్టి దోపిడీని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం దుర్మార్గమని రావి వెంకటేశ్వరరావు ఖండించారు. వైకాపా నాయకులు జేబుదొంగల మాదిరి రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: