ETV Bharat / state

'రూ. 1.7 లక్షల కోట్లు వేటికి ఖర్చు చేశారో చెబుతారా?'

వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విశాఖ పాలీమర్స్ ఘటనపై తప్పు కప్పిపుచ్చుకునేందుకే సాధారణ ప్రజలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

tdp leader uma maheswar rao conference on vishaka gas leakage
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : May 20, 2020, 9:36 AM IST

వైకాపా ప్రభుత్వం పౌరులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన చెందారు. విశాఖ పాలీమర్స్ ఘటనపై తప్పు కప్పిపుచ్చుకునేందుకే సాధారణ పౌరులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రూ. 50 లక్షల టన్నుల ఇసుక దోపిడి దందా వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరిగిందని ఆయన ఆరోపించారు.

ఉన్నత న్యాయస్థానాలు స్పందించి సూమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ రూ. 2వేల కోట్ల రూపాయలకు పైగా పనులు గత తెదేపా హయాంలో చేస్తే.. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లింపు చేయలేదన్నారు. రూ. లక్ష 70వేల కోట్లు.. మార్చి 31 వరకు దేనికి ఖర్చు పెట్టారో ప్రభుత్వానికి ధమ్ము ధైర్యం ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు దోచుకునేందుకు రివర్స్ టెండరింగ్ డ్రామాలకు తెరతీసారని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:

విజయవాడ రానున్న 3 ప్రత్యేక విమానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.