అసంఘటిత కార్మికులకు మద్దతుగా ఇసుక కొరతపై మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర చేపట్టిన 36గంటల నిరాహార దీక్షను కృష్ణా జిల్లా నేతలు విరమింపజేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొణకళ్ళ నారాయణ, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబు, ఇతర నేతలు మచిలీపట్నం తెదేపా కార్యాలయం నుంచి పాదయాత్రగా కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లారు. ర్యాలీలో ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ఉద్యమాలను అణచలేరని... 36గంటల దీక్ష విజయవంతంగా పూర్తి చేశామని కొల్లు రవీంద్ర అన్నారు. ఉద్యమం ఇంతటితో ఆగదన్న కొల్లు.. మరింతగా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'పోలీసులను అడ్డుపెట్టుకుని..ఉద్యమాలను అణచలేరు'
ఇసుక కొరతపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన 36గంటల నిరాహార దీక్షను కృష్ణాజిల్లా తెదేపా నేతలు విరమింపజేశారు. ఉద్యమం ఇంతటితో ఆగదని... దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్తామని కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అసంఘటిత కార్మికులకు మద్దతుగా ఇసుక కొరతపై మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర చేపట్టిన 36గంటల నిరాహార దీక్షను కృష్ణా జిల్లా నేతలు విరమింపజేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొణకళ్ళ నారాయణ, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్బాబు, ఇతర నేతలు మచిలీపట్నం తెదేపా కార్యాలయం నుంచి పాదయాత్రగా కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లారు. ర్యాలీలో ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ఉద్యమాలను అణచలేరని... 36గంటల దీక్ష విజయవంతంగా పూర్తి చేశామని కొల్లు రవీంద్ర అన్నారు. ఉద్యమం ఇంతటితో ఆగదన్న కొల్లు.. మరింతగా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ravi
Conclusion: