ETV Bharat / state

'ఆ రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి' - ఈ క్రాప్ విధానంపై దేవినేని ఉమా మండిపాటు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దేవినేని ఉమా మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలను అడ్డం పెట్టుకొని భారీ అవకతవకలు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని దేవినేని ఉమా ప్రశ్నించారు.

దేవినేని ఉమా
దేవినేని ఉమా
author img

By

Published : Jun 15, 2022, 5:18 PM IST

రైతు భరోసా కేంద్రాలను అడ్డం పెట్టుకొని భారీ అవకతవకలు, అవినీతికి పాల్పడుతూ.. వైకాపా సర్కార్ రైతుల గొంతు కోస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతు నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఉమా.. రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.రైతు బోగస్ కేంద్రాలు చేసిన పాపాలకు సమాధానం చెప్పలేక అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఫోనులు కట్టేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.

ప్రభుత్వం విడుదల చేసిన రూ.2,907 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఎవరెవరి ఖాతాల్లో పడ్డాయో.. మొత్తం వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. క్రాప్ బుకింగ్, పంటల బీమా చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ క్రాప్​ నుంచి 20 లక్షల మంది రైతులను ఏ లెక్కన తొలగించారో చెప్పాలన్నారు.

అగ్రికల్చర్, రెవెన్యూ ఆఫీసర్లను నామమాత్రం చేసి.. సలహా మండలి పేరుతో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో రైతులను దోపిడి చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. వాలంటీర్లు ఇచ్చిన లిస్టు మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసర్లు పైకి పంపిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో రూ.7,500 కోట్ల మొత్తాన్ని వివరాలతో సహా చంద్రబాబు అసలైన రైతులకు అందించారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.