అప్పులు, అవినీతి సంపాదనతో పాటు, వివిధ రకాల పన్నుల రూపంలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పీల్చిపిప్పి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బియ్యం, పప్పులు, నూనెల ధరలతో పాటు గ్యాస్, విద్యుత్, పెట్రోల్-డీజిల్, ఆర్టీసీ ఛార్జీలు దారుణంగా పెరిగాయని మండిపడ్డారు.
ఆదాయం ఎటు పోతోంది...?
ధరల పెరుగుదలతో ఒక్కో పేద కుటుంబంపై 2 లక్షల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందన్న విషయం ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని దుయ్యబట్టారు. గత 20 నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,40,000 కోట్లకు అదనంగా.. ఇసుక, మద్యం, భూముల అమ్మకాలు, ఇళ్లపట్టాల పంపిణీ ద్వారా సంపాదించిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బొండా డిమాండ్ చేశారు.
ఎవరి వాటాలు ఎంత...?
మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఏటా 5 వేల కోట్ల రూపాయలు జగన్కు ముడుతున్నాయని ఆరోపించారు. ఆయన వాటా పోను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల వాటాలు ఎంతో చెప్పాలని నిలదీశారు.
ఇదీ చదవండి: