నా ముగ్గురు కూతుళ్లతో కలిసి మాజీమంత్రి అఖిలప్రియను ప్రేమగా చూసుకున్నందుకు... నన్నే చంపాలని చూస్తోందని తెదేపా నేత ఏవీ.సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలప్రియ .., ఆమె భర్త భార్గవరాముడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లోని నివాసంలో ఆయన మాట్లాడుతూ రవిచంద్రా రెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజూరెడ్డితో చంపించేందుకు 50 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారని తెలిపారు. అఖిలప్రియ కుట్రను కడప పోలీసులు భగ్నం చేసి తనను కాపాడారని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తక్షణమే అఖిలప్రియ, భార్గవరాముడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు పార్టీ టికెట్టు ఇవ్వొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
'దయచేసి ఆమెకు పార్టీ టికెట్టు ఇవ్వొద్దు' - ఏవీ సుబ్బారెడ్డి వార్తలు
మాజీమంత్రి అఖిలప్రియ.., ఆమె భర్త భార్గవ రాముడు .. తనను చంపేందుకు కుట్ర పన్నారని తెదేపా నేత ఏవీ.సుబ్బారెడ్డి ఆరోపించారు. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజూరెడ్డితో చంపించేందుకు 50 లక్షలకు సుఫారీ మాట్లాడుకున్నారని ఆయన హైదరాబాద్లో తెలిపారు.