ETV Bharat / state

Atchannaidu: నారా లోకేశ్‌ రెండు నెలల పాటు అలుపెరుగని పోరాటం చేశారు - సీఎంపై అచ్చెన్న మండిపాటు

పరీక్ష(Exams)ల రద్దు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండు నెలల పాటు అలుపెరుగని పోరాటం చేశారని తెదేపా నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) అన్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ పరీక్షల విషయంలో సీఎంకి స్పష్టత రాలేదని ఎద్దేవా చేశారు.

tdp leader atchannaidu talked on board exams
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
author img

By

Published : Jun 25, 2021, 12:53 PM IST

రాష్ట్రంలో పరీక్ష(Exams)ల నిర్వహణకు మొండిగా ముందుకెళ్లిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ స్పష్టత రాలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) దుయ్యబట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువత తలుచుకుంటే ఏమైనా సాధిస్తారని మరోసారి నిరూపితమైందన్నారు. పరీక్షల రద్దు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండు నెలల పాటు అలుపెరుగని పోరాటం చేశారని.. సీఎం జగన్‌ మాత్రం మూర్ఖంగా వ్యవహరించారని మండిపడ్డారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్‌ సఫలమయ్యారన్నారు. సీఎం జగన్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించే సమయం దొరకలేదా? అని నిలదీశారు. ప్రధాని మోదీ సైతం పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకుంటే ఆ మాత్రం సమయం కూడా లేదన్నట్లు జగన్‌ వ్యవహరించారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు.

ఇదీ చూడండి. SAND ISSUE: ఇసుక అక్రమ తరలింపు ఆరోపణలపై పరిశీలన.. వైకాపా, తెదేపా నేతల మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.