రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కచ్చితంగా 160 స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో తెలుగురైతు విభాగం కార్యశాలలో అచ్చెన్న పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును కలిసి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో వివరించాలన్నారు.
రైతులను సీఎం జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందన్నారు. ఉద్యోగుల నుంచి పేదల వరకు ప్రతీ రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసును తెదేపాకు అంటగట్టాలని చూశారని మండిపడ్డారు. వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారు.. వివేక కేసులో నిందితులను ఎందుకు శిక్షించట్లేదని నిలదీశారు.
ఇదీ చదవండి:
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకురావాలి - కనకమేడల