అమరావతి మహిళల పట్ల పోలీసుల తీరు అమానుషమని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు అమరావతి రైతులంటే ఎందుకంత కక్షో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టకూడదన్నది కూడా డీజీపీకి తెలియదా అని వంగలపూడి అనిత నిలదీశారు.
అమల్లో లేని దిశ చట్టానికి అయిదు అవార్డులు వచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకోవటం సిగ్గుచేటని వంగలపూడి అనిత విమర్శించారు. పోలీసు వ్యవస్థ తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!