TDP's fact-finding committee: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గుడివాడలో క్యాసినో నిర్వహణపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఈ కమిటీకి సమన్వకర్తగా వ్యవహరిస్తారు. కొడాలి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన క్యాసినోపై కమిటీ పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అధిష్టానానికి ఇవ్వనుంది. జూదాలతో ఈ రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భ్రష్టుపట్టిస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇదీ చదవండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
CM YS Jagan Review: రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణ చేపట్టండి: సీఎం జగన్