విజయవాడ దుర్గగుడిలో భారీగా అవినీతి జరిగితే.. కేవలం స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని.. అసలు వారిని వదిలేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలు కాపాడాలన్నారు.
ఇదీ చదవండి: మనబడి నాడు-నేడులో సీఎం జగన్ కీలక నిర్ణయం