ETV Bharat / state

CBN: రాష్ట్రంలో రివర్స్ గేర్ పాలన.. యువత మేల్కోకపోతే భవిష్యత్ అంధకారమే: చంద్రబాబు - ఏపీ ముఖ్యవార్తలు

Chandrababu Naidu : సాధారణ మహిళకు ఉండే జ్ఞానం సీఎం, పేటీఎం బ్యాచ్​కు లేదని, నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలను నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలనకో కొత్తగా ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించిన చంద్రబాబు.. రాష్ట్రంలో నిరుద్యోగం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని విమర్శించారు. యువత మేల్కొకుంటే భవిష్యత్ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దలు, అవినీతి కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి మళ్లిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 3, 2023, 4:53 PM IST

Updated : May 3, 2023, 5:10 PM IST

రాష్ట్రంలో రివర్స్ గేర్ పాలన.. యువత మేల్కోకపోతే భవిష్యత్ అంధకారమే: చంద్రబాబు

Chandrababu Naidu fire on CM Jagan : రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి మళ్లిపోతున్నాయని, నిరుద్యోగం బాగా పెరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల జగన్ పాలనలో కొత్తగా ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని, ప్రభుత్వ పెద్దల అవినీతి, బెదిరింపుల వల్ల పారిశ్రామికవేత్తలు తిరిగి వెనక్కి మళ్లిపోతున్నారని తెలిపారు. అమరావతి పూర్తయితే రాష్ట్ర ఆదాయం, పోలవరం పూర్తి చేసి ఉంటే రైతుల ఆదాయం పెరిగేదని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

విశాలమైన సముద్ర తీరం.. టీడీపీ హయాంలో సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ముందుకెళ్లాం అని గుర్తు చేసిన చంద్రబాబు.. 2016 సంవత్సరం నాటికే ఎఫ్‌డీఐలను ఆకర్షించే టాప్‌-3 రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. రాష్ట్రానికి వెయ్యి కిలో మీటర్ల విశాల సముద్ర తీరప్రాంతం ఉందని, అనేక దేశాలతో వ్యాపారం చేయవచ్చని వెల్లడించారు. రాష్ట్రాన్ని 2021లోగా నంబర్‌వన్‌ చేయాలని ప్రణాళిక వేసుకుని అనేక దేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. కృష్ణపట్నం నుంచి భావనపాడు వరకు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, టీడీపీ హయాంలో రూ.16 లక్షల పెట్టుబడులు తెచ్చామని వెల్లడించారు.

ప్రజా వేదిక విధ్వంసంతో మొదలు.. విశాఖలో మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి.. ఏపీలో పెట్టుబడి పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదనేలా విధానాలు తయారు చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఖనిజ సంపద, సారవంతమైన భూములు, నీటి సౌకర్యం ఉంది.. అన్ని పోర్టులను ఉపయోగించుకుంటే ఎంతో ముందుండేవాళ్లం అని అన్నారు. కానీ, ప్రజావేదిక విధ్వంసంతో రివర్స్ గేర్‌ పాలన ప్రారంభించిన జగన్.. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ దిట్ట అని దుయ్యబట్టారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఏపీకి వచ్చింది రూ.5,750 కోట్లు మాత్రమే.. ఇది కేవలం 0.42 శాతమే అని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి రావాలని పారిశ్రామికవేత్తలు కోరుకోవడం లేదని, రాష్ట్రంలో తరచుగా విధానాలు మారతాయన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయంగా చెప్పారు.

వెనక్కి మళ్లిన కంపెనీలు.. రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు తిరిగి వెనక్కి ఎందుకెళ్లారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల అనేక కంపెనీలు ఏపీ నుంచి పారిపోయాయని, అవినీతి, బెదిరింపుల వల్లే అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని తెలిపారు. అదానీ డేటా సెంటర్‌కు టీడీపీ హయాంలోనే శంకుస్థాపన చేశాం.. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు?.. భోగాపురం విమానాశ్రయంపై జగన్‌కు ఏమైనా స్పష్టత ఉందా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

ఏపీ అంటేనే భయపడేలా... హైదరాబాద్‌లో 5 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాం.. భోగాపురంలోనూ భోగాపురం విమానాశ్రయానికి 2,700 ఎకరాలు సేకరించాం అని తెలిపారు. విమానాశ్రయానికి ఎన్నో అడ్డంకులు కల్పించిన వైఎస్సార్సీపీ నేతలు.. ఇపుడు 500 ఎకరాలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన భూమిలోనూ కొంత తీసేసుకున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏపీ అంటే భయపడేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో మీరు తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి అని సూటిగా ప్రశ్నించారు.

ఉద్యోగాల కోత.. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 0.1 శాతం మాత్రమే.. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగం 35.4 శాతానికి పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆపేశారు.. డీఎస్‌సీ వేయడం లేదు.. పీజీ చదివే విద్యార్థులకు ఉపకారవేతనాలు ఆపేశారు.. ఎస్‌ఆర్‌ఎం, విట్‌, ప్రముఖ వర్సిటీలను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ నుంచి 70 వేల మంది విద్యార్థులు పక్క రాష్ట్రం తెలంగాణ ఎంసెట్ రాస్తున్నారని అన్నారు.

రజనీకాంత్​పై విమర్శలు ఎందుకు.. టీడీపీ హయాంలో హైదరాబాద్‌లో పెట్టుబడులకు పోటీపడి వచ్చారు.. ఇక్కడ ఐటీ చదివిన విద్యార్థులు విదేశాల్లో బాగా సంపాదిస్తున్నారు.. ఇప్పటికైనా మేలుకోకుంటే యువతకు భవిష్యత్తు లేదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుంటే యువత భవిత అంధకారమే అని అన్నారు. సాధారణ మహిళకుండే జ్ఞానం కూడా సీఎం, పేటీఎం బ్యాచ్‌కు లేదని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తాము అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. రజనీకాంత్‌ ఏమన్నారని వైఎస్సార్సీపీ నేతలు తిడుతున్నారు?.. వైఎస్సార్సీపీ పరిపాలన గురించి ఏమీ మాట్లాడలేదే..?.. హైదరాబాద్‌ అభివృద్ధి గురించి రజనీకాంత్‌ మాట్లాడితే మీకెందుకు ఎందుకు? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆదాయం పెరిగేది.. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ద్విచక్రవాహనాల కొనుగోళ్లు తగ్గాయని ఉదహరించారు. అమరావతి పూర్తయితే రాష్ట్ర ఆదాయం, పోలవరం పూర్తి చేసి ఉంటే రైతుల ఆదాయం పెరిగేదని చెప్పారు. విద్యా దీవెన కోసం అన్నిచోట్లా అప్పులకు తిరిగారని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు కంకణం కట్టుకున్నారని, పోలవరం కట్టే ఏజెన్సీని మార్చవద్దని చెప్పినా వినలేదని మండిపడ్డారు. పోలవరం గురించి అందరిపైనా ఎదురుదాడి చేస్తున్నారని, బందరు పోర్టుకు మరోసారి శంకుస్థాపన చేస్తారా? అని ప్రశ్నించారు. తరచుగా అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరారు.

కలిస్తే తప్పేంటి.. తాను పవన్ కలిస్తే వైఎస్సార్సీపీ నాయకులు భయంతో ప్యాంట్లు తడుపుకుంటున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రజనీకాంత్ ఏపీకి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడకూడదా అని నిలదీశారు. జగన్ నార్త్ కోరియాలో కిమ్ కు సోదరుడని మండిపడ్డారు. జగన్ గురించి.. ఈ ప్రభుత్వం గురించి రజనీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ఎన్టీఆర్ గురించి.. హైదరాబాద్ గురించి రజనీ మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం వాళ్లు తెలుగు వాళ్ల గురించి ఏమనుకుంటారు..? ఛీ అనుకోరా అని దుయ్యబట్టారు. పవన్ తాను కలవకూడదా అని నిలదీశారు. వైఎస్సార్సీపీ నేతలు రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు తీసుకోనంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని ఈ విధంగా చేసి.. పైగా స్టిక్కర్లు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6093 అని మీ మొహల మీద స్టిక్కర్లు వేసుకోవాలని మండిపడ్డారు. ఏమన్నా అంటే.. కులాల పేర్లతో తిట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తనను.. పవన్ ను కులాలతో తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ గొడవలు గురించి పట్టించుకోకుండా రాష్ట్రం గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో సీఎం జగన్ ఏ చేస్తున్నారని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికి ఎందుకు ముందుకు రావడంలేదని నిలదీశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు.. ఏమైందని ధ్వజమెత్తారు. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆర్బీకేలు ఎత్తిపోయాయని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి :

Last Updated : May 3, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.