కృష్ణా జిల్లా మైలవరంలో అన్నక్యాంటీన్ తెరవాలని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా తెదేపా నేతలు నిరసన చేపట్టారు. పేదవాడికి కడుపు నింపే అన్న క్యాంటీన్‌ను ప్రభుత్వం కావాలనే మూసివేస్తోందని విమర్శించారు. పేదవాడికి అన్నం పెట్టే పథకంపై రాజకీయాలు తగదని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
ఇదీ చదవండి.