BANNERS: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్.ఎన్ గొల్లపాలెంలో వైకాపా, తెలుగుదేశం బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఇవాళ అంకాలమ్మ తల్లి జాతర సందర్భంగా ఊరి ముఖద్వారం వద్ద రెండు పార్టీల తరఫున బ్యానర్లు ఏర్పాటు చేశారు. మూడేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పోటాపోటీగా శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. రాత్రివేళ బ్యానర్లు చించివేయడం గ్రామంలో కలకలం రేపింది.
ఇవీ చదవండి: తెనాలిలో దారుణం.. మూగ యువతిపై అత్యాచారం