విజయవాడ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు. నగరంలో రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ దుర్భరంగా ఉందని... తక్షణమే ప్రభుత్వం రహదారుల మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాదచారులకు ఫుట్ పాత్లు లేవని.. ఉన్న ఫుట్ పాత్లు ఆక్రమణకు గురయ్యయని అన్నారు. రహదారులు దారుణంగా ఉన్న కారణంగా వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: