కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఆర్పీఎఫ్ క్యాంప్‌లోని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ మరియా విన్నర్‌గా గుర్తించారు. పిన్నమనేని సిద్దార్థ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కుమార్తెకు అనారోగ్యంగా ఉందని ఇంటి వద్ద నుంచి ఫోన్ వచ్చింది... ఇంటికి వెళ్లడానికి అధికారులు సెలవు ఇవ్వకపోవటంతో తీవ్ర ఒత్తిడికి లోనై మరియా విన్నర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి