కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం నిమ్రా కొవిడ్ ఆస్పత్రి సిబ్బంది తమకు సహకరించలేదని తహసీల్దార్ సూర్యరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ మాధవిలత ఆసుపత్రి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో.. వారి విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొవిడ్ చికిత్సకు అధిక ఫీజు వసూలు చేస్తున్ట్లు నిమ్రా కొవిడ్ ఆస్పత్రిపై ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ వైద్యం పొందిన వ్యక్తి.. ఆసుపత్రి యజమాన్యం తన వద్ద నుంచి అధిక నగదు వసూలు చేశారని ఆరోపిస్తూ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ మాధవిలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌లు ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బందిని.. అధికారులు ప్రశ్నించగా బదులివ్వకపోగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తహసీల్దార్ తెలిపారు. దీనిపై 176, 355 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చదవండి: