కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ మసూలా పేరుతో కలెక్టర్ ఇంతియాజ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యర్ధ పదార్ధాలను రోడ్లపై వేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతోందని పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించారు. తాగే చెరువు నీటిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు వేస్తున్నారని దీని వల్ల ఆరోగ్యానికి హాని కులుగుతుందన్నారు. నెలకు రెండు రోజులు స్వచ్ఛ మసూలా కార్యక్రమంలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీచదవండి