YSRCP Former MLA DY Das: కుట్రపూరితంగానే తనను వైకాపా నుంచి సస్పెండ్ చేశారని పామర్రు మాజీ ఎమ్మెల్యే డి.వై. దాస్ అన్నారు. జగన్ కోరితేనే వైకాపాకు మద్దతు తెలిపానన్నారు. పార్టీ కోసం అనుచరులతో కలిసి రేయిపగలూ పని చేశానన్నారు. పామర్రులో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని,.. స్థానిక ఎమ్మెల్యే అనిల్ ప్రజలకు దూరమయ్యాడన్నారు. పామర్రులో ఇసుక, మట్టి మాఫియా చెలరేగిపోతుందని ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేపర్లోనే చూశానని తెలిపారు.
ఎటువంటి వివరణ అడగకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రజల్లో ఒకడిగా ఉంటానని స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి ప్రజాసేవలో ఉంటానని తెలిపారు. ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండటంతోనే అసూయతో స్థానిక శాసనసభ్యులు ఆయన ఆటలు సాగటం లేదని.. అవినీతిపనులకు అడ్డుగా ఉంటున్నానని తనను పార్టీ నుంచి తొలగించారని ఆరోపించారు.
ఇవీ చదవండి: