ETV Bharat / state

నాలుగో సింహం... కరోనాపై జయం - ఆంధ్రప్రదేశ్ కరోనా వార్తలు

ఆత్మవిశ్వాసమే తోడుగా పోలీసులు కరోనాను జయిస్తున్నారు. మహమ్మారిపై పోరులో తొలి వరసలో ఉంటున్న వీరిలో చాలామంది వ్యాధి బారిన పడ్డారు. ఆరోగ్య, ఆహార నియమాలను పాటిస్తూ కరోనాపై గెలిచి వారు మళ్లీ విధుల్లో చేరుతున్నారు.

story on police cured form corona virus in andhrapradesh

author img

By

Published : Aug 7, 2020, 9:57 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 3,600 మందికి పైగా పోలీసులు కొవిడ్‌ బారిన పడ్డారు. కొందరు ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో.. మరికొందరు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. ఇప్పటివరకు 1893 మంది కోలుకున్నారు. వీరిలో 80 శాతం మంది తిరిగి విధులకు హాజరవుతున్నారు. మిగిలినవారు విశ్రాంతి సమయం పూర్తయ్యాక విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

  • ఒక్క జులైలోనే 3,200 మందికిపైగా

మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్‌ మొదలైన నాటినుంచి అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45 మంది పోలీసులు మాత్రమే కొవిడ్‌ బారిన పడ్డారు. వారంతా కోలుకున్నారు. అన్‌లాక్‌ మొదలయ్యాక జూన్‌ మొదటి వారంలో 39 మందికి ఈ వైరస్‌ సోకింది. ఆ నెలాఖరుకు ఈ సంఖ్య 230కు పెరిగింది. జులైలో ఆంక్షలు దాదాపు సడలించడంతో కేసుల ఉద్ధృతి పెరిగింది. ఆ ఒక్క నెలలోనే 3,200 మందికిపైగా పోలీసులు వైరస్‌ బారిన పడ్డారు. రికవరీ రేటు మెరుగ్గా ఉండటంతో మిగతా వారిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. 55ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని కార్యాలయ విధులకు వినియోగించటంవంటి చర్యల వల్ల ముప్పు తగ్గింది.

  • ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. ధైర్యం నింపుతూ

తమ సిబ్బందికి కొవిడ్‌ వచ్చిందని తెలిసిన వెంటనే ఆయా జిల్లాల ఎస్పీలు, డీఐజీలతో పాటు పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నారు. బాధితులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేసి టెలీకాన్ఫరెన్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలిస్తున్నారు. అదనపు డీజీపీ స్థాయి అధికారికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ బాధ్యతలను అప్పగించారు. కరోనాను జయించిన సిబ్బందికి ఆయా స్టేషన్లలో ఘనస్వాగతం పలుకుతూ మనోబలాన్ని పెంచుతున్నారు.

  • కరోనా నుంచి కోలుకున్న పోలీసులు ఏమంటున్నారో వారి మాటల్లోనే...

ఆందోళనతోనే అనర్థం
మొదట్లో శ్వాస ఇబ్బందితోపాటు విపరీతమైన దగ్గు వచ్చింది. న్యూమోనియా మొదలైంది. సీటీ స్కాన్‌ చేయించటంతో కరోనా నిర్ధారణ అయింది. వెంటనే ఆసుపత్రిలో చేరా. వారం తర్వాత ఈ లక్షణాలు తగ్గాయి. నీరసంగా ఉండటంతో కొన్ని రోజులు హోం ఐసొలేషన్‌లో ఉన్నా. కోలుకోవటంతో 2 రోజుల కిందట మళ్లీ విధుల్లోకి చేరా. ధైర్యంగా ఉంటే త్వరగా కోలుకోవచ్చు.

-ఎం.వెంకటరమణ, డీఎస్పీ, కల్యాణదుర్గం సబ్‌డివిజన్‌

ధైర్యంగా ఉండాలి
జలుబుగా ఉండటంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. నాలుగైదు రోజుల తర్వాత దగ్గు ప్రారంభమైంది. వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్‌లో ఉన్నా. కరోనా వస్తే మన పక్కన ఎవరూ ఉండరు. మనకు మనమే ధైర్యంగా ఉండాలి. అది కోల్పోతే ఇబ్బందులు ఎదురవుతాయి. నేనైతే తొలి నుంచి ఇదే తరహాలో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. కోలుకుని ఎప్పటిలాగానే విధులకు హాజరవుతున్నా.

- వై.సింహాచలం, ఎస్సై-2, శ్రీకాకుళం వన్‌టౌన్‌

రోజూ మాట్లాడారు
పాజిటివ్‌ అని తేలగానే భయపడ్డా. నాపై నేను నమ్మకం కోల్పోయా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. వాసన, రుచి రెండూ పోయాయి. వెంటనే క్వారంటైన్‌లో చేరా. మా ఉన్నతాధికారులు జూమ్‌ యాప్‌ ద్వారా ప్రతి రోజూ మాట్లాడుతూ ధైర్యం నింపేవారు. తగిన ఆహారం తీసుకున్నా. విశ్రాంతి తీసుకుని నాలుగు రోజుల నుంచే విధులకు హాజరవుతున్నా. నాకు లభించిన ఘనస్వాగతాన్ని చూసి కష్టమంతా మరిచిపోయా.

- కె.రవికుమార్‌, కానిస్టేబుల్‌, కైకలూరు టౌన్‌

ఇదీ చూడండి

రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్రమే: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.