ETV Bharat / state

నిలిచిన పత్తి కొనుగోళ్లు...అన్నదాతల ఆగ్రహం - నందిగామ సీసీఐలో నిలిచిన పత్తి కొనుగోళ్లు తాజా వార్తలు

సీసీఐ గత వారం రోజులుగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయటం పట్ల కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్​ యార్డులో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్​కు పత్తి తీసుకువచ్చినా.. కొనుగోలు చేయటం లేదని వాపోతున్నారు.

నిలిచిన పత్తి కొనుగోళ్లు
నిలిచిన పత్తి కొనుగోళ్లు
author img

By

Published : Dec 5, 2020, 5:28 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్​ యార్డులో కాటన్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గత వారం రోజులుగా పత్తి కొనుగోళ్లు చేయకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యత లేదని సీసీఐ బయ్యర్స్​ కోనుగోళ్లు చేయటంలో విముఖత చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో తడిసిన పత్తి నాణ్యత లేదని..., ఇలాంటి పత్తి కోనుగోలు చేయలేమని బయ్యర్ చెప్పటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ యార్డ్ ఆవరణలో ప్రస్తుతం పత్తి నిల్వలు పేరుకుపోతున్నా.. గత కొన్ని రోజులుగా కొనుగోలు చేయటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. బయ్యర్ తీరుపై స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు సీసీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇకనైనా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

నందిగామ మార్కెట్ యార్డ్ కార్యదర్శి రవి కుమార్ వివరణ కోరగా...నాణ్యత లేకపోవటం వల్లే బయ్యర్ పత్తిని కొనుగోలు చేయటం లేదని తెలిపారు. ఇప్పటివరకు యార్డులో 3,800 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశామని తెలిపారు. నేరుగా జిన్నింగ్ మిల్లులకు వెళ్లే పత్తిని కలుపుకొని 12,000 క్వింటాలు కొనుగోలు చేశామని వెల్లడించారు.

ఇదీచదవండి

పూర్తిగా నష్టపోయాం.. పరిహారం అందలేదు: లోకేశ్​తో రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.