ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఎన్నికయ్యారు. ఈ సంఘానికి ఛైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహరిస్తారు. ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తంతోపాటు మరో 8అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. నూతనకార్యవర్గం విజయవాడ గేట్‌వే హోటల్‌లో సమావేశమైంది. ఎమ్మెల్యే కంటే క్రీడాకారుడిని అని చెప్పుకోవటం తనకు ఎంతో ఇష్టమని.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కృష్ణదాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్ కబ్జాలో ఉందని.... సమస్య పరిష్కారం చేస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారని వివరించారు. త్వరలో గుంటూరులో ఏపీ ఒలింపిక్ భవన్ నిర్మాణం చేపడతామని హమీ ఇచ్చారని అన్నారు. శిక్షకుల కొరత తీరుస్తామని.. క్రీడా సంస్కృతిని పొందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దేశంలోనే క్రీడల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ప్రధాన కార్యదర్శి పురుషోత్తం అన్నారు.
ఇది కూడా చదవండి.