ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని ఛైర్మన్ పి.గౌతంరెడ్డి తెలిపారు. తద్వారా విద్యార్ధులు, యువత, ఉద్యోగులతోపాటు అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. విజయవాడలోని ఎపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు... రాష్ట్ర ఫైబర్ నెట్ విధానాన్ని రూపొందించామని చెప్పారు. సంస్థాగతంగా ఆదాయ వనరులను పెంచుకోవడంతోపాటు... గత పాలకులు చేసిన అప్పులపై వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ ద్వారా 300 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామనని చెప్పారు.
నూతన ఫైబర్ విధానం ద్వారా ఆంధ్రా యూనివర్సిటీ కార్యాలయ స్థాయిని పెంచుతున్నామని గౌతంరెడ్డి తెలిపారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లైన్లను లీజుకు ఇస్తున్నామని... ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ద్వారా ఏటా ఏడు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని చెప్పారు. ప్రతీ గ్రామంలో ఇంటర్నెట్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 13 జిల్లాల్లో 670 మండలాల పరిధిలోని 11,274 గ్రామాలకు ఈ ఆప్టికల్ ఫైబర్ ను తీసుకెళ్తామని... విజయవాడ, విశాఖ, కడపలలో పైలట్ ప్రాజెక్టు ద్వారా 15 ఎంబీపీఎస్ అన్ లిమిటెడ్ 147 రూపాయలకు, 80 ఎంబీపీఎస్ 360 రూపాయలకు ఇవ్వబోతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: