కరోనా పరీక్షలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ అర్జా తెలిపారు. 104 కాల్‌సెంటర్‌కు రోజుకు 10 వేలకు పైగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. 70 వేలకు పైగా ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. రోజుకు 35 వేల వరకూ పరీక్షలు చేస్తున్నామన్న ఆయన.. బ్యాక్‌లాగ్ పెరగటం వల్ల రిపోర్టులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. ట్రూనాట్ పరీక్ష 60 నిమిషాల్లో ఫలితాలను అందిస్తుందన్న శ్రీకాంత్ అర్జా.. 48 గంటల్లోపు కిట్లను జిల్లాలకు పంపించి ట్రూనాట్ పరీక్షలు మొదలుపెడతామన్నారు.
ట్రూనాట్, ర్యాపిడ్ టెస్టులను కూడా మొదలుపెట్టాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ర్యాపిడ్ టెస్టులు కూడా వినియోగించి బ్యాక్‌లాగ్ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...