పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతోపాటు విద్యార్థులు రక్తదానం చేశారు. ఆపదలోఉన్నవారికి రక్తదానం చేయడంవల్ల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానం చెయాలని నందిగామ డీఎస్పీ రమణమూర్తి సూచించారు.రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని అన్నారు.
ఇదీ చదవండి:పోలీసు అమరవీరులను స్మరించుకోవాలి