కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం ప్రాంగణంలో 6 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన... సోలార్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పాదన పక్రియను విమానాశ్రయ మేనేజర్ మధుసూధనరావు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని భారత విమానయాన సంస్థ యోచించిందని తెలిపారు. అందుకు అనుగుణంగా గన్నవరం విమానాశ్రయ ప్రాంగణంలో 6ఎకరాల స్థలంలో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్ధ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారన్నారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ప్లాంట్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నా... గన్నవరంలో నిర్మాణ పనులు తక్కువ కాలంలో పూర్తిచేసి ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ టెర్మినల్ పూర్తైతే... దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల విద్యుత్ అవసరాలు తీర్చేలా ప్లాంటు సామర్ధ్యం పెంచుతామని మధుసూధనరావు చెప్పారు.
ఇదీ చదవండి...