జగ్గయ్యపేటలోని తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవం వేడుకగా సాగింది. ఏడు వంశాలకు చెందిన వ్యక్తులు స్థానిక మున్నేరు నదిలో నీటిని నింపుకొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నది నుంచి ఆలయం వరకు నృత్యాలు, కోలాటాలు, తప్పెట్లతో ఊరేగింపుగా తీసుకు వెళ్లారు.
మున్నేరు నుంచి గ్రామంలోకి చేరుకున్న నీటి బిందెలకు.. గ్రామస్థులు ఎదురేగి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ బిందెలను ఆలయంలో నవధాన్యాలు చల్లిన మట్టిపై ఉంచటంతో కార్యక్రమం ముగిసింది. వేడుకల్లో ఆలయ ఈవో మూర్తి, సర్పంచ్ పద్మ కుమారితో పాటు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతాం: తితిదే