విజయవాడకు చెందిన ప్రియాల్ రాఖీల వ్యాపారంలో రాణిస్తోంది. అందరిలా మార్కెట్లో విక్రయించే రాఖీల్లా తాను తయారు చేస్తే పెద్దగా డిమాండ్ ఉండదని భావించిన ఆమె... ప్రత్యేకంగా రీ యూజబుల్( పునర్ వినియోగ రాఖీలు) తయారు చేస్తోంది. దీంతో ఈ రాఖీలకు బాగా డిమాండ్ వస్తోంది. ఇప్పటికే 150కి పైగా తమ రాఖీలను దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పంపినట్లు ప్రియాల్ చెబుతోంది. రక్షాబంధన్ రోజున రాఖీని కట్టిన తర్వాత కొన్ని రోజులకే దాన్ని తీసి పాడేస్తారు. అలా కాకుండా చెల్లి, అక్క గుర్తుగా తమ దగ్గరే ఆ రాఖీలు ఉంచుకునే విధంగా ఈ రాఖీతోపాటు కీ చైన్ పంపుతున్నట్లు ఆమె వివరించారు. దీంతో వీటికి బాగా డిమాండ్ పెరిగిందని.. నగరంలోనూ చాలా మంది ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారని ప్రియాల్ చెబుతోంది.
తమ ఇంట్లో ఉన్న వస్తువులతో రాఖీలు..
తమ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ ప్రత్యేమైన రాఖీలను తయారు చేస్తున్నట్లు ప్రియాల్ తెలిపారు. ప్రత్యేకంగా వీటి తయారీ కోసం వేటిని కొనుగోలు చేయటంలేదన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రాఖీలు తయారు చేస్తున్నట్లు వివరించారు. నెలన్నర క్రితం నుంచే ఈ రాఖీల కోసం ఆర్డర్లు వస్తున్నాయని.. రూ. 70 నుంచి 90 వేల వరకు సంపాదించినట్లు చెబుతోంది. తాను ఎంబీఏ చేసిన అనంతరం ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేస్తానంటోంది విజయవాడకు చెందిన ప్రియాల్.
ఇదీ చదవండి..