రాష్ట్రంలో క్షేత్రస్థాయి కొవిడ్ పరిస్థితులు, రోగులకు అందే వైద్యంపై ఆరా తీసేందుకు.. ప్రత్యేక నేవీ బృందం విశాఖపట్నం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరిన బృందం సభ్యులు అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రాణవాయువు నిల్వలు, అవసరమైన ఇతర అంశాలపై అధ్యయనం చేయనుంది. ఈ అంశాలపై నివేదికను రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. ఈ బృందం తొలుత కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి…: 'టెలీమెడిసిన్ ద్వారా కరోనా రోగులకు వైద్యం'